TDP Leader Somireddy Fire On Minister Kakani Govardhan Reddy: మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి అనుచరుల ఆగడాలు.. టీడీపీ శ్రేణులపై దాడులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 1, 2023, 9:08 PM IST
TDP Leader Somireddy Fire On Minister Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి అనుచరుల ఆగడాలు అధికమౌతున్నాయని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి గురై నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కసుమూరు టీడీపీ దళిత నేత వెంకట రమణయ్యను సోమిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సోమిరెడ్డి.. మంత్రి కాకాణి అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని తెలిపారు. మంత్రి కాకాణి అనుచరులు సంస్కారహీనంగా మాట్లాడుతుంటే, వాటిని ఖండించే తమ పార్టీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. మంత్రి కాకాణి వ్యవసాయ శాఖ గురించి పట్టించుకోకుండా... దోచుకోవడం, దౌర్జన్యం చేయడమే పనిగా.. పెట్టుకున్నారని సోమిరెడ్డి దుయ్యబట్టారు. జిల్లా ఎస్పీ అయినా దీనిపై స్పందించి తమపై వైసీపీ నేతల దాడులను అరికట్టేలా చర్యలు చేపట్టాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.
"మంత్రి కాకాణి అనుచరులు సంస్కారహీనంగా మాట్లాడుతుంటే, వాటిని ఖండించే మా పార్టీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు. మంత్రి కాకాణి వ్యవసాయ శాఖ గురించి పట్టించుకోకుండా దోచుకోవడం, దౌర్జన్యం చేయడమే పనిగా.. పెట్టుకున్నారు. జిల్లా ఎస్పీ అయినా దీనిపై స్పందించి మాపై.. వైసీపీ నేతల దాడులను అరికట్టేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నాము." - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి