Somireddy on Anilkumar: ప్రమాణం చేస్తే అనిల్‌కుమార్ నీతిమంతుడు అవుతారా..?: సోమిరెడ్డి - Somireddy algeations on anilyadav
TDP leader Somireddy Chandramohan Reddy: ఎమ్మెల్యే అనిల్ వెయ్యి కోట్లు ఆస్తి సంపాదించినట్లు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ కోరే దమ్ము వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కు గానీ, ప్రభుత్వానికి గానీ ఉందా అంటూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాల్ విసిరారు. భూములు ఉన్నట్లు లోకేశ్ ఆధారాలు విడుదల చేశారని,.. అనిల్ ప్రమాణం చేస్తే నీతిమంతులు అవుతారా అంటూ ఎద్దేవా చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల.. అవినీతి, అక్రమాల కారణంగా రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తోందని సోమిరెడ్డి విమర్శించారు.
నెల్లూరు రూరల్ మండలం కందమూరు గ్రామానికి చెందిన దళితుడైన ఉదయగిరి నారాయణ మృతిపై ఘటనపై సోమిరెడ్డి స్పందించారు. పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఉదయగిరి నారాయణను చిత్రహింసలకు గురి చేసి, అడవిలో చెట్టుకు ఊరేసి చంపారని సోమిరెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై తాను ఎస్సీ కమిషన్ ఫిర్యాదు చేయడంతో బాధిత కుటుంబానికి న్యాయం చేశారని సోమిరెడ్డి వెల్లడించారు. ఉదయగిరి నారాయణ పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన పొదలకూరు ఎస్ఐ కరీముల్లా, మద్దతుగా ఉంటున్న మంత్రి కాకాణిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతో... నారాయణ మృతిపై సమాధానం చెప్పాలని మానవ హక్కుల సంఘం రెండు సార్లు కలెక్టర్, ఎస్పీలను కోరినట్లు తెలిపారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆగస్టు 25న మానవ హక్కుల సంఘం ఎదుట హాజరుకావాలని సమన్లు జారీ చేసిందని వెల్లడించారు.