ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Venkateswara Rao

ETV Bharat / videos

Raavi on TIDCO Houses: వైసీపీ ప్రభుత్వానికి పేద ప్రజల ఉసురు తగులుతుంది: రావివెంకటేశ్వరరావు - TDCO ఇళ్లపై వెంకటేశ్వరరావు

By

Published : Jun 9, 2023, 10:23 PM IST

Ravi Venkateswara Rao Fire On YCP: పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న కొడాలి నాని, వైసీపీ ప్రభుత్వానికి.. వాళ్ల ఉసురు తగులుతుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. కృష్ణాజిల్లా గుడివాడలో టిడ్కో ఫ్లాట్ల ప్రారంభోత్సవం వాయిదాపై మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న పేదలను ఇంత మోసం చేస్తారా అంటూ మండిపడ్డారు. చంద్రబాబు కష్టం, వెంకయ్య నాయుడు సహకారంతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకుందని, ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలన్నారు. తొమ్మిది నెలలు ఓపిక పడితే, సీఎం హోదాలో చంద్రబాబు చేతుల మీదుగా ఫ్లాట్లను అప్పగిస్తామని తెలిపారు టీడీపీ హయాంలో 80శాతం పూర్తి చేసిన టిడ్కో ఫ్లాట్లను ఇప్పటికీ ఇవ్వలేకపోతున్నారని, చంద్రబాబు కష్టం మా కృషి నాశనం అవుతుంటే గుండె తరుక్కుపోతుందని రావి వెంకటేశ్వరరావ ఆవేదన వ్యక్తం చేశారు.

టిడ్కో ఇళ్ల భవనాలు ప్రారంభోత్సవం వాయిదా పడటం దురదృష్టం. నాలుగేళ్లుగా పేద ప్రజలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు ఇప్పటికి నాలుగు సార్లు వాయిదా పడగా.. ఇది ఐదవ సారి. ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం చేసిన పని కేవలం దోచుకోవటం. -రావివెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే 

ABOUT THE AUTHOR

...view details