ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌ఛార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అరెస్టు - ఇంట్లో ప్రెస్‌మీట్ నిర్వహిస్తుండగా పోలీసుల ఎంట్రీ - TDP leader arrested by police in proddatur
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 13, 2023, 3:54 PM IST
TDP Leader Praveen Kumar Reddy Arrested: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని (GV Praveen Kumar Reddy) పోలీసులు అరెస్ట్ చేశారు. నందం సుబ్బయ్య (Nandam Subbaiah) హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ కార్యకర్త బెనర్జీపై గత నెల 28వ తేదీన తెలుగుదేశం కార్యకర్తలు భరత్, రాము కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ప్రవీణ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. గత 17 రోజులుగా ప్రవీణ్ అజ్ఞాతంలో ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం నేతలతో కలిసి ఆయన ఇంట్లో ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.
దాడితో సంబంధం లేకపోయినా.. అక్రమంగా కేసు నమోదు చేశారంటూ ప్రవీణ్ సహా తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. జీపు ఎక్కకుండానే.. త్రీ టౌన్ స్టేషన్‌కు నడుచుకుంటూ ర్యాలీగా వెళ్లారు. ప్రవీణ్‌తో పాటు కుటుంబ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి, కార్యకర్తలు కూడా పాదయాత్రగా ఆయన వెంటే వెళ్లారు. ప్రవీణ్ అరెస్టు ఘటన పట్టణంలో సంచలనంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి కుట్రతోనే తనను అక్రమ కేసులో ఇరికించారని ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపింంచారు.