TDP Leader Payyavula PPP on Skill Case ఇదిగో.. ఆ రూ.371 కోట్లు ఇలా వెళ్లాయి! కలాం ప్రశంసించిన ప్రాజెక్టుపై బురద జల్లుతున్నారు..: టీడీపీ నేత పయ్యావుల - Tdp leader Payyavula Keshav comments
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 22, 2023, 4:46 PM IST
Payyavula Power Point Presentation on Skill Development Project: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) నిధుల విషయంలో అక్రమాలు జరిగాయంటూ.. వైఎస్ జగన్ ప్రభుత్వం కక్షపూరితంగానే తప్పుడు ప్రచారం చేస్తోందని.. తెలుగుదేశం ఎమ్మెల్యే, ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్‌ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇవిగో వాస్తవాలు' అంటూ ఆయన ఈరోజు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రజంటేషన్‌లో భాగంగా రూ.371 కోట్లలో ప్రతి రూపాయి ఎవరికి, ఎలా వెళ్లాయి..? అనే వివరాలను వెల్లడించారు.
Payyavula Keshav Comments:పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. ''స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. అవాస్తవాలు ప్రచారం చేసి, చంద్రబాబుపై బురద జల్లుతున్నారు. మన రాష్ట్ర పిల్లలకు నైపుణ్యం పెంచేందుకే శిక్షణ ఇచ్చాం. కానీ, ఇప్పుడు లక్షల మంది యువత జీవితాల్లో నిప్పులు పోస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను అబ్దుల్ కలాం కూడా ప్రశంసించారు. శిక్షణ తీసుకున్న పిల్లలు ప్రపంచవ్యాప్తంగా వెళ్లే పరిస్థితి వచ్చింది. అమెరికాలో 25 యూనివర్సిటీలు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. మోదీ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్‌లో ఈ కార్యక్రమం జరిగింది. మరో 5 రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమం అమలు చేశారు. ఎవరికీ కనిపించని అవినీతి జగన్‌కు ఎందుకు కనిపిస్తోంది..?, ఈ కేసులో డబ్బు ఎక్కడికీ పోయినట్లు నిరూపణ కాలేదు. రివర్స్ టెండరింగ్‌లా రివర్స్ ఇన్వెస్టిగేషన్‌లా ఈ కేసు ఉంది. అవినీతి చేయబోమని సంతకం చేస్తేనే ఒప్పందాలు జరుగుతాయి. 1997 తర్వాత మన దేశంలో సీమెన్స్ కార్యక్రమాలు బాగా పెరిగాయి. నిధుల విడుదలలో ఎలాంటి తప్పు జరగలేదు. అధికారులు కూడా ఎలాంటి తప్పు చేయలేదు. నలుగురు అధికారుల బృందం గుజరాత్ వెళ్లి పరిశీలించి నివేదిక ఇచ్చింది. ఎక్కువ మంది పిల్లలకు శిక్షణ ఇవ్వడం తప్పా..?'' అని ఆయన అన్నారు.