ఆంధ్రప్రదేశ్

andhra pradesh

tdp-leader-pattabhiram-demanded-cm-jagan-answer-on-sand-looting

ETV Bharat / videos

TDP Leader Pattabhi Demand CM Jagan Answer on Sand Looting: చంద్రబాబు ఆరోపణలపై జగన్ ఎందుకు పెదవి విప్పడం లేదు..?

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2023, 7:29 PM IST

TDP Leader Pattabhi Demand CM Jagan Answer on Sand Looting: రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీకి సంబంధించి చంద్రబాబునాయుడు సంధించిన ప్రశ్నలకు ఇసుకాసురుడు జగన్ రెడ్డి ఎందుకు సమాధానం చెప్పడం లేదని తెలుగుదేశం పార్టీ  అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నిలదీశారు. జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ క్వార్టర్లీ ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్టులపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలతో తమకేం సంబంధం లేదని, ఊరూపేరులేని మరో పార్టీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చామని, ఈ విషయం ఏపీప్రభుత్వానికి కూడా తెలుసంటున్న జేపీ వెంచర్స్ సంస్థ రిపోర్టులపై ఇసుకాసురుడు నోరు విప్పాలని డిమాండ్‌ చేశారు.

జేపీ వెంచర్స్  తాము ఎవరెవరికి, ఎక్కడెక్కడ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చామనే వివరాలను డీఎంజీ  డైరెక్టరేట్ ఆఫ్ మైనింగ్ అండ్ జియాలజీ (Directorate of Mining and Geology) వారికి తెలుసంటూ వెల్లడించిన ఫైనాన్షియల్ రిపోర్ట్ నిజమా.. కాదా అంటూ పట్టాభిరామ్‌ నిలదీశారు. ఊరూ..పేరు లేని సబ్ కాంట్రాక్టర్​ను తీసుకువచ్చారని పేర్కొన్నారు. పైకి జేపీ వెంచర్స్ పేరు చెబుతూ... దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. 40వేల కోట్ల విలువ చేసే.. ఇసుకను దోపిడీ చేశారని మండిపడ్డారు. జేపీ ఎవరికీ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జేపీ పేరుతో నకిలీ బిల్లులను ఇస్తున్నారని మండిపడ్డారు.  

ABOUT THE AUTHOR

...view details