రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన వైసీపీ - ప్రభుత్వ ఆదాయమంతా వడ్డీలకే : విజయ్‌కుమార్ - ఏపీ అప్పులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 22, 2023, 3:26 PM IST
TDP Leader Neelayapalem Vijay Kumar on AP Debts: వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని తెలుగుదేశం అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ మొత్తం రుణాలు 11 లక్షల కోట్లు దాటాయాన్నారు. జగన్‌రెడ్డి అప్పులతో ఈ ఏడాది 28 వేల 626 కోట్ల వడ్డీలు కట్టాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ల అప్పులకు కట్టే వడ్డీలు కలిపితే ఆ మొత్తం మరింత పెరుగుతుందని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయమంతా వడ్డీలు కట్టడానికే సరిపోతుందన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానమని ఆర్‌బీఐ నివేదిక చెప్పిందని విజయ్‌కుమార్ తెలిపారు. అప్పులు తీసుకోవటంలో దేశంలోనే టాప్-3లో రాష్ట్రం ఉందని, 2023-24లో రాష్ట్రాలన్నీ చేసిన అప్పులో ఏపీ వాటా 11.6 శాతమని పేర్కొన్నారు. విద్యారంగంలో ఎక్కువ ఖర్చు చేస్తున్నామని అబద్ధాలు చెబుతున్నారని, గత ప్రభుత్వం కంటే తక్కువే ఖర్చు చేశారన్నారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేసే ఆస్పత్రులకు బిల్లులు ఇవ్వడం లేదని, వైద్యరంగానికి బడ్జెట్‌లో 5.6 శాతమే ఖర్చు పెట్టారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం విద్య, వైద్య, సంక్షేమం, పెట్టుబడుల రంగాలకు చేసిన ఖర్చు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువని ఆర్బీఐ నివేదిక తేల్చిందని నీలాయపాలెం విజయ్‌కుమార్ వెల్లడించారు.