ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP Leader Mother Suicide Attempt Chittoor District

ETV Bharat / videos

TDP Leader Mother Suicide Attempt Chittoor District: పుంగనూరు కేసులో కుమారుడికి బెయిల్‌ రాలేదంటూ తల్లి ఆత్మహత్యాయత్నం - Punganur Incident

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 26, 2023, 12:49 PM IST

TDP Leader Mother Suicide Attempt Chittoor District: తన కుమారుడు జైలులో ఇబ్బందులు పడుతున్నాడని ఓ తల్లి తట్టుకోలేకపోయింది. బైయిలు మీద వస్తాడని ఎంతగానో ఎదురుచూసింది. కొంత మందికి బెయిలు రాగా.. అందులో తన కుమారుడు లేకపోవడంతో తీవ్ర ఆవేదనకి గురైంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుంగనూరు పర్యటనలో జరిగిన అల్లర్ల కేసులో తన కుమారుడికి బెయిల్‍ రాలేదని మనస్తాపంతో ఓ తల్లి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా సోమల మండలంలోని ఇరికిపెంటలో జరిగింది. గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు నాయుడు పుంగనూరులో జరిగిన అల్లర్ల కేసులో అరెస్టై కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో 50 మందికి ఆదివారం బెయిల్ (Bail for TDP Leaders in Punganur Incident) రాగా శ్రీనివాసులు నాయుడుకు బెయిల్ రాలేదు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన తల్లి రాజమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఆమెను కుటుంబసభ్యులు 108 వాహనంలో సదుం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details