ఆంధ్రప్రదేశ్

andhra pradesh

mohammad_sharif_on_cm_jagan

ETV Bharat / videos

ప్రజా సమస్యలపై చంద్రబాబు పోరాడుతుంటే జగన్‌కు భయం పట్టుకుంది : టీడీపీ నేత మొహమ్మద్ షరీఫ్ - TDP Leader Mohammad Sharif News

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 21, 2023, 5:26 PM IST

TDP Leader Mohammad Sharif on CM Jagan: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్ తీర్పును చూసైనా.. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి తన తీరును మార్చుకోవాలని.. టీడీపీ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ మొహమ్మద్ షరీఫ్ హితవు పలికారు. జగన్ రెడ్డి పాలనలో మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు పాల్పడుతున్నారని షరీఫ్ ఆరోపించారు.

Mohammad Sharif Comments: ''టీడీపీ అధినేత చంద్రబాబుపై.. సీఐడీ, జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఆరోపణల్లో ఒక్క దానికి న్యాయస్థానం ముందు సరైన ఆధారం చూపలేకపోయారు. సిగ్గులేకుండా చంద్రబాబు సాక్ష్యాలు తారుమారు చేస్తారని కోర్టులో చెప్పారు. బెయిల్‌ ఇచ్చేటప్పుడు కూడా షరతులు విధించాలని కోర్టును కోరారు. ప్రజా సమస్యలపై చంద్రబాబు పోరాడుతుంటే.. జగన్‌కు భయం పట్టుకుంది. వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనలో జరిగిన అవినీతిని చంద్రబాబు బయటపెడతారని జగన్‌కు భయమా..?. హైకోర్టు తీర్పును చూసైనా జగన్‌ తన తీరును మార్చుకోవాలి. హైకోర్టులో సాక్ష్యాలు, ఆధారాలు చూపలేక పరువు పోగోట్టుకున్నారు. ప్రభుత్వం, సీఐడీ.. వైఫల్యాల్ని తప్పుల్ని న్యాయస్థానం ఎత్తి చూపినందుకు సిగ్గులేకుండా అవినీతి మీడియాలో న్యాయస్థానాలపై, న్యాయమూర్తులపై విష ప్రచారం చేశారు. వచ్చే ఎన్నికల్లో మైనారిటీలు పూర్తిగా తెలుగుదేశానికే సహకరిస్తారు.'' అని మొహమ్మద్ షరీఫ్ స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details