ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP_Leader_Lokesh_Sensational_Comments_on_CM_Jagan

ETV Bharat / videos

వైఎస్సార్సీపీ మునిగిపోయే నావ - ఏ శక్తీ కాపాడలేదు: లోకేశ్ - సీఎం జగన్​పై లోకేశ్ ఫైర్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 4, 2024, 5:38 PM IST

TDP Leader Lokesh Sensational Comments on CM Jagan: అభ్యర్థులు పారిపోయినా, సీట్లు మార్చినా మునిగిపోయే వైఎస్సార్సీపీ నావను ఏ శక్తీ కాపాడలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పాలనకు ప్రజలు స్వస్తి పలకడం తథ్యమని సామాజిక మాద్యమం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ప్రజాగ్రహానికి గురైన ఎమ్మెల్యే, ఎంపీలు పరారీలో ఉన్నారని విమర్శించారు. ఇప్పటికి 35 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వారి సొంత నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు భయపడి పారిపోయారని పేర్కొన్న ఆయన వారితో పాటు మరో 50 మంది ఎమ్మెల్యేలు విముఖంగా ఉన్నట్లు వినిపిస్తోందన్నారు. వైఎస్సార్సీపీలో ఓటమి భయానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. 2024లో ఇక జగన్ ఉండడన్న లోకేశ్ ఏపీ 'బైబై జగన్' అంటుందని పేర్కొన్నారు. 

"అభ్యర్థులు పారిపోయినా, సీట్లు మార్చినా  మునిగిపోయే వైఎస్సార్సీపీ నావను ఏ శక్తీ కాపాడలేదు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పాలనకు ప్రజలు స్వస్తి పలకడం తథ్యం. ప్రజాగ్రహానికి గురైన ఎమ్మెల్యే, ఎంపీలు పరారీలో ఉన్నారు. ఇప్పటికీ 35 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వారి సొంత నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు భయపడి పారిపోయారు. వారితో పాటు మరో 50 మంది ఎమ్మెల్యేలు విముఖంగా ఉన్నట్లు వినిపిస్తోంది. వైఎస్సార్సీపీలో ఓటమి భయానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం"-ట్విటర్​లో నారా లోకేశ్ 

ABOUT THE AUTHOR

...view details