TDP Leader Kuna Ravikumar Falls ill Hospitalised: టీడీపీ నిరసన కార్యక్రమం.. స్పృహ తప్పి పడిపోయిన కూన రవికుమార్ - స్పృహ తప్పి పడిపోయిన కూన రవికుమార్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 14, 2023, 10:47 PM IST
TDP Leader Kuna Ravikumar falls ill hospitalised: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా గత రెండు మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై టీడీపీ శ్రేణులు ఎప్పటికప్పుడు ఆదోళన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం టీడీపీ శ్రేణులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి కూన రవికుమార్ (Kuna Ravikumar) పాల్గొన్నారు. అధినేత అరెస్ట్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగడుతూ ప్రసంగిస్తున్నారు. సభలో మాట్లాడుతున్న కూన ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా మాట్లాడుతుండగానే కుప్పకూలిపోయారు. అస్వస్థతకు గురైన కూన రవికుమార్‌ని తెలుగుదేశం నేతలు హుటాహుటిన శ్రీకాకుళం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆయనను పరిశీలించిన ఆసుపత్రి వైద్యులు పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించారు. అనతరం కూన రవికుమార్ ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.