ఏపీని కేసీఆర్‌కు అమ్మేద్దామని జగన్ మోహన్ రెడ్డి చూస్తున్నారు: కన్నా లక్ష్మీనారాయణ - Tdp leader Kanna Lakshminarayana news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2023, 5:20 PM IST
TDP Leader Kanna Lakshminarayana on CM Jagan:రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేసీఆర్‌కు అమ్మేద్దామని జగన్ మోహన్ రెడ్డి చూస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఓడించి.. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
Kanna Lakshminarayana Comments:ఎన్జీ రంగా 123 జయంతి సందర్భంగా టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లా బృందావన్ గార్డెన్స్‌లోని విగ్రహం వద్ద నివాళులర్పించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ..''2019 ఎన్నికల్లో జగన్ ప్రజల్ని మోసం చేసి గెలిచారు. ఆ తర్వాత జగన్ రాష్ట్రాన్ని ఎంతలా దోచుకున్నారో ప్రజలు గమనించారు. అందుకే గతకొన్ని నెలలుగా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు చేసి గెలవాలని చూస్తున్నారు. కాబట్టి ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఓడించి రాష్ట్రాన్ని కాపాడుకుందాం. సాగర్ ఎడమ కాలువ ద్వారా 40 రోజులుగా తెలంగాణాకు నీరు వెళ్తున్నా.. సీఎం నోరు విప్పటం లేదు. ఇప్పటికే హైదరాబాద్‌లో మన రాష్ట్ర ఆస్తులు పోగొట్టారు... మళ్లీ గెలిస్తే ఈ ఆంధ్రప్రదేశ్‌ను కేసీఆర్‌కు అమ్మేద్దామని జగన్ చూస్తున్నారు'' అని ఆయన అన్నారు.