ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

TDP Leader Kanakamedal: చంద్రబాబుతో ములాఖత్ అయిన ఎంపీ కనకమేడల రవీంద్ర... - టీడీపీ ఎంపీ ఆన్ వైసీపీ

🎬 Watch Now: Feature Video

TDP Leader Kanakamedal

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 7, 2023, 10:02 PM IST

TDP Leader Kanakamedal:  స్కిల్ డెవలప్​మెంట్ ఆరోపణలు ఎదుర్కుంటూ రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న తెలుగుదేశం అధినేతన నారా చంద్రబాబు నాయుడిని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కలిశారు. స్కిల్‌ కేసులో కొండను తవ్వి ఎలుకను పట్టారని కనకమేడల రవీంద్ర కుమార్‌ ఎద్దేవా చేశారు. ప్రజల్ని మభ్య పెట్టడానికి ఆధారాలు లేని కేసులు పెట్టి... ప్రభుత్వం కాకమ్మ కథలు చెబుతోందని మండిపడ్డారు. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుతో ఎంపీ కనకమేడల  ములాఖత్ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  

స్సిల్ కేసులో రూ.370 కోట్ల అవినీతి ఆరోపణలు చేసి చివరికి  రూ.27 కోట్ల అవినీతి జరిగిందటూన్నారని కనకమేడల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును చూస్తే ప్రభుత్వం వణికి పోతుందని విమర్శలు గుప్పించారు. ఆ  డబ్బులు ఎలక్ట్రోరల్ బాండ్స్ ద్వారా పార్టీ ఖాతాలోకి వచ్చాయంటూ కొత్త డ్రామాకు తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఏ అకౌంట్ నుంచి డబ్బులు వచ్చాయనేది తమ పార్టీ వివరాలు వెల్లడించిందని తెలిపారు.  చంద్రబాబుకు మద్దతుగా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబును కలిసిన అనంతంర రాజమండ్రిలో ఉన్న చంద్రబాబు కుటుంబసభ్యులను కలిశారు. కేసు పెట్టి నెల రోజులు అవుతుందని.. ఇప్పటికీ చంద్రబాబుపై చేసిన ఆరోపణలను నిరూపించలేకపోతున్నారని విమర్శించారు. సీఎం జగన్ కోర్టుకు వెళ్లకుండా తన అధికారంతో కేసుల్ని అడ్డుకుంటున్నారని విమర్శించారు. 

ABOUT THE AUTHOR

...view details