
TDP Leader Kalva Srinivasulu On YSRCP Samajika Bus Yatra: "వైసీపీ నేతల సామాజిక బస్సు యాత్ర.. దగాకోరు దండయాత్రగా కనిపిస్తోంది" - వైసీపీ బస్సు యాత్రపై కాల్వ శ్రీనివాసులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 26, 2023, 9:52 PM IST
TDP Leader Kalva Srinivasulu On YSRCP Samajika Bus Yatra:వేసీపీ నేతలు చేస్తున్న సామాజిక బస్సుయాత్ర.. దగాకోరు దండయాత్రగా కనిపిస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అడుగడుగునా అన్యాయం చేస్తున్నారన్నారు. సింగనమల నియోజకవర్గంలో వైసీపీ నేతలు చేస్తున్న సామాజిక బస్సుయాత్రకు నిరసనగా.. నల్ల బెల్లూన్లు ఎగరవేసి టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. నాలుగున్నర సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం అట్టడుగు వర్గాల సంక్షేమాన్ని తుంగలో తొక్కివేసిందని మండిపడ్డారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్లలోని స్వయం ఉపాధి పథకాలను వైసీపీ ప్రభుత్వం తొలగించిందని విమర్శించారు. అడుగడుగునా అన్యాయం చేస్తూ ఏ ముఖంతో.. బస్సుయాత్ర చేస్తున్నారని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో కేవలం నలుగురు రెడ్లు మాత్రమై సంతోషంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ బీసీల ఆత్మగౌరవాన్ని వైవీ సుబ్బారెడ్డి పాదాల వద్ద పెడుతున్నారని ఆరోపించారు.