ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP leader Jawahar comments

ETV Bharat / videos

ప్రజలు ఇంకా జగన్‌ను నమ్మే పరిస్థితిలో లేరు: కేఎస్ జవహర్ - జగన్ పై జవహర్ కామెంట్స్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2023, 5:47 PM IST

TDP leader Jawahar comments on Jagan MLAs change:తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దెబ్బకు సీఎం జగన్​లో భయం పట్టుకుందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఎద్దేవా చేశారు. అందుకే ఎన్నికలకు వంద రోజుల ముందు నుంచే వైసీపీలో ప్రక్షాళనకు సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని జవహర్ విమర్సించారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జవహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తున్నారని మాజీమంత్రి ఎద్దేవా చేశారు.

151 నియోజకవర్గాల్లో కొత్త వారిని పెట్టుకున్నా జగన్‌ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని జవహర్ విమర్శించారు. యువగ‌ళం పాదయాత్రను జగన్మోహన్ రెడ్డి అడ్డుకోలేనే తమ అధినేత నారా చంద్రబాబును జైలుకు పంపించారని జవహర్ మండిపడ్డారు. లోకేశ్ యువగళం ద్వారా అన్ని వర్గాలను కలుసుకుంటూ, వారి సమస్యలు తెసుకుంటూ వారికి భరోసా ఇస్తూ, ప్రజాగళంతో పాదయాత్రను పూర్తి చేశారని జవహర్ పేర్కొన్నారు. సీఎం జగన్ హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడని జవహర్ విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details