ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP_Leader_GV_Reddy_on_Skill_Development

ETV Bharat / videos

TDP Leader GV Reddy on Skill Development: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో వైసీపీ డ్రామాలు ఆడుతోంది: జీవీ రెడ్డి - TDP Leader GV Reddy comments

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 16, 2023, 4:46 PM IST

TDP Leader GV Reddy on Skill Development: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) నిధుల మళ్లింపు విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై.. అధికార పార్టీ వాళ్లు చేస్తున్న ప్రచారాలన్నీ పచ్చి అబద్దాలని.. ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి తెలిపారు. కోడికత్తి డ్రామా, వైఎస్ వివేకానందరెడ్డి తరహాలోనే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కూడా వైఎస్సార్సీపీ డ్రామాలు ఆడుతోందని ధ్వజమెత్తారు. స్కిల్ డెవలప్‌మెంట్ విషయంలో కోర్టుల్లో ఓ రకంగా.. ప్రజల్లో మరో రకంగా చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులకి దమ్ము, ధైర్యం ఉంటే..షెల్ కంపెనీలకు సంబంధించిన పూర్తి వివరాలు, అడ్రస్‌లు, డైరెక్టర్ల పేర్లను వెల్లడించాలని జీవీ రెడ్డి సవాల్ విసిరారు.

GV Reddy Comments:స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో షెల్ కంపెనీలున్నాయంటూ వైసీపీ మంత్రులు చేస్తున్న ప్రకటనలపై.. టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో వైఎస్సార్సీపీ డ్రామాలు ఆడుతోంది. ఏవేవో పేర్లతో షెల్ కంపెనీలని ప్రచారం చేస్తోంది. కానీ, ఆ షెల్ కంపెనీలకు సంబంధించిన పూర్తి వివరాలు, అడ్రస్‌లు, డైరెక్టర్ల పేర్లు మాత్రం ప్రస్తావించడం లేదు. ఆ షెల్ కంపెనీల పేర్లను కూడా పూర్తిగా రాయడం లేదు. ఏయే షెల్ కంపెనీల పేర్లు ప్రెస్‌మీట్లో చెబుతున్నారో.. ఆ పేర్లను కోర్టుల్లో ఎందుకు చెప్పరు..?, రిమాండ్ రిపోర్ట్ దగ్గరకు వెళ్లేసరికి.. షెల్ కంపెనీల ప్రస్తావన ఎందుకు లేదు..?, సాక్ష్యాలు లేకుండా నామమాత్రంగా రిమాండ్‌ రిపోర్టు ఇచ్చారు. న్యాయస్థానాలకు ఒకలా.. ప్రజలకు మరొకలా చెబుతున్నారు.'' అని ఆయన అన్నారు.

ABOUT THE AUTHOR

...view details