ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జీవీ రెడ్డి కామెంట్స్

ETV Bharat / videos

GV Reddy fire on YSRCP : 'నాలుగేళ్ల వైసీపీ పాలనలో.. ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా..?' - TDP Leader GV Reddy

By

Published : Jun 30, 2023, 6:06 PM IST

TDP Leader GV Reddy Comments: 4 ఏళ్లలో జగన్ సంక్షేమం పేరుతో సీఎం జగన్‌ ప్రజలకు కోతలు, వాతలే మిగిల్చారని టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి విమర్శించారు. సీఎం సొంత జిల్లా కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించలేని అసమర్థుడు.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడంటే ప్రజలు నమ్ముతారా అని నిలదీశారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిని తన ఘనతగా చెప్పుకుంటూ, ప్రజల్ని మరోసారి నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. విషయ పరిజ్ఞానం లేని మంత్రులు నోటికి పని చెప్పడం తప్ప.. దేనికీ పనికిరారని ప్రజలకు అర్థమైందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలెన్ని, నెరవేర్చినవి ఎన్నో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు వచ్చి.. 4 ఏళ్లలో ఇది చేశానని చెప్పే ధైర్యం జగన్​కు ఉందా అని జీవీ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి బటన్ నొక్కడానికే ఉన్నారా అని విమర్శించారు. రాష్ట్రంలో కొత్తగా ఒక్క భవనం కూడా నిర్మించలేదని మండిపడ్డారు. హాస్పిటల్స్​కి ఆరోగ్యశీ డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆరోపించారు. అస్సలు ఆరోగ్యశీని కొనసాగించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. 

ABOUT THE AUTHOR

...view details