మునిగిపోతున్న వైసీపీ నుంచి బయటపడేందుకు పార్టీని వీడుతున్నారు: గంటా శ్రీనివాసరావు - సంక్రాంతి వేడుకలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 13, 2024, 6:09 PM IST
Sankranti celebrations at Visakha TDP office: విశాఖ టీడీపీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, విశాఖ టీడీపీ పార్లిమెంట్ అధ్యక్షుడు పల్లాశ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడారు. భోగిమంటల్లో పనికి రాని వస్తువులను వేస్తారు. 4 ఏళ్ల 9 నెలలుగా పనికిమాలిన ప్రభుత్వం వుందని, అందుకే వైఎస్సార్సీపీ ఇచ్చిన జీఓలను కాల్చి దగ్దం చేసినట్లు తెలిపారు. మునిగిపోతున్న నావలాంటి వైఎస్సార్సీపీ నుంచి సురక్షితంగా బయటపడటానికి అనేక మంది వీడిపోతున్నారని అన్నారని తెలిపారు. స్వపక్షంలో వున్న వారూ వైఎస్సార్సీపీలో ఉక్కపోతకు గురవుతున్నారని గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు.
ఎంపీలకు కూడా జగన్ ను కలిసే అవకాశం ఇవ్వడంలేదని, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ జగన్ ను రెండు సార్లే కలిశానని స్వయంగా చెప్పిన విషయాన్ని గంటా శ్రీనివాసరావు గుర్తుచేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే , అనంతపూర్ ఎమ్మెల్యేలో అసంతృప్తి మాట్లాడిన మాటలు చూశామని అన్నారు. పెనమలూరు సీనియర్ ఎమ్మెల్యే కూడా ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారని, అంబటి రాయుడు ఏదేదో ఊహించుకుని వైఎస్సార్సీపీకి వెళ్లి ఏ స్కోరూ చేయకుండానే వచ్చేశారని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎమ్నెల్యే బదిలీలు, వాటి పై అసంతృప్తి ఇంత పెద్ద ఎత్తున చూడలేదన్నారు. 50 శాతం ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీని వదిలేసే పరిస్థితి వస్తోందన్నారు. జగన్ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజల నుంచి చీత్కారాలు తప్పవని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. విశాఖ ఉమ్మడి జిల్లాలో ఏఒక్క స్ధానం కూడా వైఎస్సార్సీపీ గెలిచే అవకాశం లేదని సర్వేలు వస్తున్నాయని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.