TDP Leader Dhulipalla Narendra on Fiber Grid జగన్ అవినీతిలో స్కిల్ మాస్టర్: ధూళిపాళ నరేంద్ర - ఫైబర్ నెట్ ప్రాజెక్టుల ఆరోపణలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 20, 2023, 5:30 PM IST
TDP Leader Dhulipalla Narendra Reacted to the Fiber Grid Case: జగన్ అవినీతి స్కిల్ మాస్టర్ అని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర(Dhulipalla Narendra) ధ్వజమెత్తారు. ఫైబర్ నెట్ కనెక్షన్ ధరను తెలుగుదేశం హయాం కంటే రూ. 200 పెంచారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చాకే మెయిన్టెనెన్స్ రూపంలో కాంటాక్టర్ల నుంచి దండుకుంటోంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పదో తరగతి చదవని గౌరీ శంకర్ అనే వ్యక్తిని తీసుకెళ్లి ఫైబర్ నెట్ ఆపరేషన్స్ బాధ్యతలు అప్పజెప్పారని విమర్శించారు. గౌరీ శంకర్ కంపెనీకి ఇప్పుడు ఫైబర్ నెట్ ప్రాజెక్టులు ఇచ్చారన్నారు. ఫైబర్ నెట్ విషయంలో కొంత మంది అధికారులతో బలవంతంగా అవాస్తవాలు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ్టీ వరకు స్కిల్ కేసులో చంద్రబాబు.. లోకేశ్ ఖాతాలకు డబ్బులు చేరినట్టు నిరూపించ లేకపోయారని ఆక్షిపించారు. స్కిల్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో(Fiber Grid Case) ఆరోపణల మీదే తప్ప ఆధారాల మీద కేసులు నమోదు చేయడం లేదన్నారు.
బీదా రవిచంద్ర: ఫైబర్ గ్రిడ్ పేరుతో వైసీపీ ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెర లేపిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర దుయ్యబట్టారు. కొండలాంటి స్కిల్ స్కాం అంటూ తొండని కూడా పట్టుకోలేకపోయారన్నారు. ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ పేరుతో మరో కొండను తవ్వుతారట అని మండిపడ్డారు. కేరళ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఏపీలోని ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును ఆదర్శమని చెప్పిందని గుర్తు చేశారు. ప్రభుత్వానికి నెలనెలా ఆదాయం వచ్చేలా ఫైబర్ నెట్ ప్రాజెక్టును రూపొందించామని స్పష్టం చేశారు.