ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Dhulipalla_Narendra_fire_on_CID

ETV Bharat / videos

TDP Leader Dhulipalla Narendra fire on CID: 'ఏపీ సీఐడీ గాసిప్స్ ఏజెన్సీ.. స్కిల్ కేసులో కట్టు కథలు.. చంద్రబాబుపై బోగస్‌ కేసు..' - TDP Leader Dhulipalla Narendra news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 27, 2023, 12:56 PM IST

TDP Leader Dhulipalla Narendra fire on CID: ఆంధ్రప్రదేశ్ సీఐడీ గాసిప్‌ ఏజెన్సీలా మారిందని.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళ్లిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ కట్టు కథనాలు చెబుతోందని దుయ్యబట్టారు. 24 నెలలుగా చేపట్టిన విచారణలో చంద్రబాబు నాయుడి కుటుంబ సభ్యుల ఖాతాల్లో ఏ ఒక్క రూపాయి వచ్చి చేరినట్లు సీఐడీ నిరూపించలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి సభ్యత్వం ద్వారా వచ్చే విరాళాలను స్కిల్‌, ఫైబర్ నెట్‌ డబ్బులని చెప్పడం చూస్తుంటే.. కచ్చితంగా చంద్రబాబుపై పెట్టింది బోగస్‌ కేసే అని చాలా స్పష్టంగా అర్ధమవుతుందన్నారు.

Dhulipalla Narendra Comments: ''స్కిల్ డెవలప్‌మెంట్‌‌కు సంబంధించి.. చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్ చేసిన సీఐడీ.. గత 48 రోజులుగా ఒక్క ఆధారం కూడా సంపాదించలేకపోయింది. అంతేకాకుండా, చంద్రబాబు నాయుడి ఖాతాలో, లోకేశ్ ఖాతాలో, తెలుగుదేశం పార్టీ నాయకుల ఖాతాల్లో డబ్బులు జమ అయినట్టుగా నిరూపించకపోయింది. 24 నెలలుగా సీఐడీ చేపట్టిన విచారణ బట్టి చూస్తే.. చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసులన్నీ భోగస్ కేసులన్నీ చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. ఇవాళ ఒక గాసిప్‌ ఏజెన్సీ కింద అసత్యాలను కోర్టుల ముందు ఉంచుతూ.. న్యాయస్థానాలను ప్రభావితం చేసే కుట్రలో సీఐడీ భాగస్వామ్యం అయింది.'' అని ధూళ్లిపాళ్ల నరేంద్ర అన్నారు.

ABOUT THE AUTHOR

...view details