ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP_Leader_Dharu_Nayak_Fires_on_YCP_Govt

ETV Bharat / videos

జగన్ రెడ్డి పాలనలో గిరిజనులపై వేధింపులు, దాడులు, బలవన్మరణాలే దక్కాయి: ధారూ నాయక్ - వైసీపీ పాలనలో గిరిజనులు ఇబ్బందులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 7:18 PM IST

TDP Leader Dharu Nayak Fires on YCP Govt: గిరిజనుల పట్ల ఉద్యోగ సంఘం నాయకుడు వెంకట్రామిరెడ్డి వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరమని టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ధారూ నాయక్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్​కు వెంకట్రామిరెడ్డి తొత్తుగా మారి గిరిజన ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధారు నాయక్ ఆరోపించారు. సచివాలయంలో ఖాళీ అయిన గిరిజనుల పోస్టుల్లో తన వర్గం వారిని నియమిస్తూ గిరిజన యువతకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

జగన్ రెడ్డి పాలనలో గిరిజనులకు వేధింపులు, అవమానాలు, దాడులు, బలవన్మరణాలే దక్కాయని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లలో గిరిజన తండాలు, గూడేలకు కనీస సదుపాయాలు అందించని అసమర్థుడు జగన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాలలో ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికే గిరిజనుల నిధులను సైతం పక్కదారి పట్టించారని, ఇక ఇప్పుడు వారికి రావాల్సిన ఉద్యోగాలను దక్కకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని, లేకుంటే ఎన్నికలలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details