ఏలూరు జిల్లాలో భారీగా అక్రమ మైనింగ్ - అడ్డుకున్న టీడీపీ నేతలు - Tdp news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 10, 2023, 2:50 PM IST
TDP Leader Chintamaneni Stopped Gravel Illegal Mining: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అక్రమ దందాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలో అర్ధరాత్రి వేళ యథేచ్ఛగా అక్రమ గ్రావెల్ మైనింగ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అడ్డుకుని.. 10 లారీలు, 2 జేసీబీలు, 2 ట్రాక్టర్లను పట్టుకున్నారు. అనంతరం అక్రమ మైనింగ్ చేస్తున్న వైసీపీ నాయకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ.. పెదవేగి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు.
TDP Leaders Fire on YCP Leaders:ఏలూరు జిల్లా పెదవేగి మండలం పోలవరం కుడి కాల్వ వద్ద జరుగుతున్న గ్రావెల్ అక్రమ మైనింగ్‌ను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. అర్ధరాత్రి వేళ లారీలు, జేసీబీలు, ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున గ్రావెల్ మైనింగ్ జరపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ చేస్తున్న వైసీపీ నాయకులపై పెదవేగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అధికారులు తక్షణమే స్పందించి.. అక్రమ మైనింగ్ చేస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టుబడిన 10 లారీలు, 2 జేసీబీలు, 2 ట్రాక్టర్లతో చింతమనేని ప్రభాకర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. అక్రమ మైనింగ్ చేస్తున్న వైసీపీ నేతలపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకునే వరకూ తాము కదలేది లేదని అర్ధరాత్రి నుంచి స్టేషన్ ముందు బైఠాయించారు.