ఆంధ్రప్రదేశ్

andhra pradesh

tdp_leader_chandrababu_naidu_comments-on_ycp_government

ETV Bharat / videos

యువతకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్నదే తమ ధ్యేయం: చంద్రబాబు - kuppam constituency

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 29, 2023, 9:22 AM IST

TDP Leader Chandrababu Naidu Comments On YCP Government: వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యేలతో దొంగపని చేయించిన జగన్‌ను మార్చకుండా ఎమ్మెల్యేల్ని మారిస్తే సరిపోతుందా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. జగన్‌ సినిమా అయిపోయిందని ఇంకా వందరోజులే మిగిలి ఉందని అన్నారు. కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 

గుడిపల్లి మండలం బిసానత్తము వద్ద కార్యకర్తలు గజమాలతో ఆహ్వానించారు. గుడిపల్లిలో రైల్వే స్టేషన్ కూడలి నుంచి బస్టాండ్ వరకు రోడ్ షో నిర్వహించారు. అక్కడ ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. వైఎస్సార్​సీపీకి మరో వందరోజులే మిగిలి ఉందని, ఊరికో రౌడీని తయారు చేశారని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం నియోజకవర్గ ఇంఛార్జిలను మార్చడాన్ని చంద్రబాబు ఎద్దేవా చేశారు. బస్సు సౌకర్యం తీసేశారంటూ ఓ యువతి ఫిర్యాదు చేయగా ఇంకొన్నాళ్లు ఓపిక పట్టాలని చంద్రబాబు భరోసా ఇచ్చారు. యువతకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్నదే తన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. గురువారం రాత్రి కుప్పం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో చంద్రబాబు బస చేశారు.

ABOUT THE AUTHOR

...view details