ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP_Leader_Chandra_Babu_Tributes_to_Sardar_Vallabhbhai_Patel_and_Potti_Sriramulu

ETV Bharat / videos

అమరవీరుల చరిత్రను స్మరించుకుందాం - పటేల్, పొట్టి శ్రీరాములుకు చంద్రబాబు నివాళి - Babu Tributes to Sardar Vallabhbhai

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2023, 5:34 PM IST

TDP Leader Chandra Babu Tributes to Sardar Vallabhbhai Patel and Potti Sriramulu: స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశపు మెుదటి ఉప ప్రధానమంత్రి, ఉక్కుమనిషిగా పేరొందిన సర్ధార్ వల్లభాయ్ పటేల్, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సాటిలేని దేశభక్తితో జాతి సమైక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ అసాధారణమైన చతురత, విజ్ఞతను ప్రదర్శించారని కొనియాడారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలపడం కోసం పొట్టి శ్రీరాములు తన ప్రాణాన్ని సైతం త్యాగం చేశారని గుర్తుచేశారు. 

మహానుభావుల జీవిత చరిత్ర గురించి తెలుసుకోవడం భారతదేశ పౌరులుగా మన బాధ్యత అని యావత్ ప్రజానీకానికి తెలియజేశారు. ప్రజల మనసులో చిరస్మరణీయంగా నిలిచి, దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగం మరచిపోలేనిదన్నారు. స్ఫూర్తిదాయకమైన వారి చరిత్రలను స్మరించుకుందామని సామాజిక మాధ్యమం ద్వారా ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details