ఆంధ్రప్రదేశ్

andhra pradesh

bond_uma_on_ysrcp_welfare_schemes

ETV Bharat / videos

57 నెలల్లో చేసిన సాయం గోరంత - జగన్‌ కొట్టేసింది కొండంత : టీడీపీ నేత బొండా ఉమ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 5:10 PM IST

TDP Leader Bonda Uma on YSRCP Welfare Schemes: తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ మ్యానిఫెస్టోను రాబోయే రెండు నెలల్లో అమలు చేసి, రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త నాటకానికి తెరతీశారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండ ఉమ ఆరోపించారు. సంక్షేమ పథకాల ముసుగులో వైఎస్ జగన్ ప్రజలకు చేసింది గోరంత సాయం, కొట్టేసింది కొండంత అని ధ్వజమెత్తారు. జగన్ ఇప్పటికిప్పుడు ఎన్నికల కోసం కొత్త హామీలిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బొండా ఉమ పిలుపునిచ్చారు. 

Bonda Uma Comments: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల అమలుపై బొండ ఉమ ఎన్టీఆర్‌ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''సంక్షేమం పేరుతో 57 నెలల్లో వైఎస్ జగన్ ప్రజలకు చేసిన సాయం గోరంత, కొట్టేసింది కొండంత. జగన్ పరిపాలనలో అన్ని వర్గాల జీవితాలు తలకిందులయ్యాయి. రాష్ట్రంలో కోటికిపైగా మహిళలుంటే కేవలం 2 లక్షల మందికే చేయూత కింద రూ.18 వేలు అందించారు. 50 లక్షల మంది కాపు మహిళలుంటే, కేవలం 2.50లక్షల మందికే కాపునేస్తం సాయం అందించారు. దేశంలో తొలిసారి పింఛన్లు అందించి, వాటిని రూ.200 నుంచి రూ.2వేలకు పెంచింది తెలుగుదేశం పార్టీనే. జగన్ పాలనలో అమ్మఒడి, చేయూత, కాపునేస్తం, సామాజిక పింఛన్లలో ఇప్పటివరకూ పెట్టిన కోతల సొమ్ము ఎక్కడికి వెళ్లింది?, ఎవరికి చేరిందో? ముఖ్యమంత్రి చెప్పాలి. సంక్షేమ పథకాలకు ఎంత ఇచ్చారో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి.'' అని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details