TDP Leader Bonda Uma "టీడీపీ ర్యాలీలో..వైసీపీ ఎమ్మెల్యే బొల్లాను ఎందుకు అనుమతించారు..?" - వినుకొండలో టీడీపీ నేతలపై దాడి
TDP Leader Bonda Uma on YCP MLA Bolla: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులపై భౌతిక దాడులకు పాల్పడుతోందని ఆ పార్టీ నేత బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఎమ్మెల్యే అవినీతి అక్రమాలను బయటపెట్టేందుకు యత్నించినందుకే వినుకొండలో టీడీపీ నేతలపై దాడికి పాల్పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ర్యాలీ చేస్తుంటే వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుని పోలీసులు ఎందుకు అనుమతించారని నిలదీశారు. వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు కొండలు, గుట్టలు ఆక్రమించారని బొండా ఆరోపించారు. వినుకొండలో టీడీపీ నేతలపై జరిగిన దాడుల వైఫల్యాలకు కారణమైన సీఐ, డీఎస్పీని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వినుకొండలో టీడీపీ నేతలపై జరిగిన దాడులను వీడియో క్లిప్పింగ్స్‌తో సహా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దృష్టికి సైతం తీసుకువెళ్తామని బొండా ఉమా తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని.. అదే జరిగితే తాడేపల్లిలోని సీఎం ఇల్లు ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.