ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP_Leader_Ayyannapatrudu_on_CBN_Arrest

ETV Bharat / videos

TDP Leader Ayyannapatrudu on CBN Arrest: చంద్రబాబు అరెస్టును వైసీపీ నాయకులూ తప్పుబడుతున్నారు : అయ్యన్నపాత్రుడు - ఏపీ లేటెస్ట్ న్యూస్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 29, 2023, 12:51 PM IST

Updated : Oct 29, 2023, 1:28 PM IST

TDP Leader Ayyannapatrudu on CBN Arrest: చంద్రబాబు అరెస్టును వైసీపీ నాయకులూ తప్పుబడుతున్నారని.. తెలుగుదేశం సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలూ జరగలేదన్నారు. 

ఇదిలా ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును(Chandrababu Arrest) ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ.. వ్యవస్థలను మేనేజ్ చేయటం వల్లే చంద్రబాబు 50 రోజులుగా జైల్లో ఉన్నారని మండిపడుతున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు ఆరోగ్యం, భద్రత(TDP Leaders on Chandrababu Health and Security)పై పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యంపై తెలుగు జాతి ఆందోళనలో ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

"చంద్రబాబు అరెస్టును వైసీపీ నాయకులే తప్పుబడుతున్నారు. వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలూ జరగలేదు." - చింతకాయల అయ్యన్నపాత్రుడు, టీడీపీ సీనియర్ నేత

Last Updated : Oct 29, 2023, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details