TDP Leader Ayyanna Fire on Kodali Nani: కొడాలి నానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన.. అయ్యన్నపాత్రుడు - టీడీపీ నేత అయ్యన్న కామెంట్స్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 26, 2023, 10:34 PM IST
TDP Leader Ayyanna Fire on Kodali Nani తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు చేసిన అభివృద్ధి కొడాలి నాని లాంటి సన్నాసులకు కనపడదని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. హరికృష్ణకు టీ మోసిన కొడాలి నాని.. నందమూరి కుటుంబం నాశనాన్ని కోరుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కోసం నిరసనలు చేసే వాళ్లల్లో బడుగులే ఎక్కువని తెలిపారు. కొడాలి నానికి ఓటేసి గెలిపించినందుకు గుడివాడ ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. లోకేశ్ పాదయాత్ర ప్రారంభిస్తానంటే రాజమండ్రి బ్రిడ్జిని రిపేర్ల పేరుతో మూసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుట్కా నాని.. రోజా.. అంబటి, గుడివాడ అమర్నాధ్ లాంటి వాళ్లని మేం ఊపేక్షించమని హెచ్చరించారు. రింగ్ లేదు.. రోడ్డు లేదు.. అదేం కేసుని ఎద్దేవా చేసారు. వ్యవస్థలను చేతిలో పెట్టుకుని కేసులు పెడుతున్నారని ఆరోపించారు. 18 రోజులు చంద్రబాబును జైల్లో పెట్టారు.. ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారని విమర్శలు గుప్పించారు. చిన్న చిన్న సందుల్లో కూడా 144 సెక్షన్ పెట్టే దిక్కుమాలిన పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు.