TDP Leader Atchannaidu on Chandrababu బాబు క్వాష్పై సాంకేతిక ఇబ్బందులనే కోర్టు ప్రస్తావించింది ! న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది: అచ్చెన్నాయుడు - chandrababu arrest news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 22, 2023, 6:37 PM IST
TDP State President Achchennaidu on Chandrababu Cash Petition: స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి.. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో వేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు న్యాయస్థానం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు హైకోర్టు తీర్పుపై.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పందించారు. న్యాయస్థానాల మీద తమకు గౌరవం ఉందని, త్వరలోనే తమ పార్టీ అధినేత చంద్రబాబు విడుదలవుతారని అన్నారు.
Achchennaidu Comments:టీడీపీ పార్టీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ..''తెలుగుదేశం పార్టీలో ప్రతీ కార్యకర్త ఓ నాయకుడే. ప్రతీ నాయకుడు ఓ చంద్రబాబే. చంద్రబాబుని అరెస్టు చేస్తే..వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించవచ్చనే పిచ్చి భ్రమలో జగన్ ఉన్నాడు. పార్టీ తరఫున రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి. గ్రామాల్లో ప్రతీ గడపా తట్టి, జగన్ అక్రమాలు వివరిస్తూ.. బాబుతో నేను కార్యక్రమం కొనసాగిస్తాం. ఏ ఆధారాలు లేకుండా అరెస్టు చేసిన సీఐడీ, చంద్రబాబుని మరింత ఇబ్బంది పెట్టాలనే కస్టడీ కోరింది. స్కిల్ కేసుపై క్వాష్ చేయటానికి సాంకేతిక ఇబ్బందులు న్యాయస్థానం ప్రస్తావించింది. కానీ, కేసుపై ఎలాంటి కామెంట్ చేయలేదు. న్యాయపరంగా ఏ విధంగా ముందుకెళ్ళాలో ఆలోచించి, అందుకనుగుణంగా వెళ్తున్నాం. హైకోర్టు తీర్పులో చంద్రబాబు ఎక్కడా అవినీతికి పాల్పడ్డారని చెప్పలేదు. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని మాత్రమే హైకోర్టు చెప్పింది. న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది. టీడీపీకి బలం కార్యకర్తలే. ఎక్కడ కూడా కార్యకర్తలు మనోధైర్యం కోల్పోలేదు.'' అని ఆయన అన్నారు.