TDP Leader Atchannaidu Comments on CM Jagan: "నాలుగున్నరేళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను మంట కలిపారు"
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 26, 2023, 5:05 PM IST
TDP Leader Atchannaidu Comments on CM Jagan over TTD Members: ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను మంట కలిపారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఓ క్రైస్తవుడిని టీటీడీ ఛైర్మన్‌గా నియమించారని మండిపడ్డారు. దిల్లీ మద్యం కుంభకోణంలో అప్రూవర్‌గా మారిన పెనాక శరత్ చంద్రారెడ్డి లాంటి దొంగని టీటీడీ సభ్యుడిగా నియమించారని మండిపడ్డారు.
Atchannaidu Comments: జగన్ పెట్టిన కష్టాలు మరువకుండా కసితో పని చేయాలని టీడీపీ నేతలకు అచ్చెన్న పిలుపునిచ్చారు. 'ఇసుక సత్యాగ్రహం' పేరుతో ఈ నెల 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి 45 రోజుల పాటు 'బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీ' కార్యక్రమం నిర్వహించనున్నట్లు అచ్చెన్న తెలిపారు. కోటి ఇళ్లను కలిసేలా కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లేలా సభలు పెడుతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 31వ తేదీన యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరుతున్న సందర్భంగా సంఘీభావం తెలపాలని నేతలకు సూచించారు.
Atchannaidu Comments on Votes Deletion: సంఘీభావ యాత్రలో జగన్ ప్రభుత్వ బాధితులను భాగస్వామ్యం చేయాలని కోరారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో చంద్రబాబు 30 నియోజకవర్గాల్లో పర్యటిస్తారని అచ్చెన్న తెలిపారు. రాయలసీమ నుంచి చంద్రబాబు పర్యటనలు ప్రారంభం కానున్నాయని, ఓటర్ వెరిఫికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓటర్ల జాబితా విషయంలో దొంగే దొంగా అంటూ వైసీపీ వ్యాఖ్యాలు చేస్తోందన్నారు. చంద్రబాబు సీఈసీకి ఫిర్యాదు చేస్తుంటే, తామూ ఫిర్యాదు చేస్తామంటూ వైసీపీ కూడా సీఈసీని కలుస్తారట, ఇలా చేయడానికి వైసీపీకి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.