ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ashok_Gajapathiraju_on_Paidithalli

ETV Bharat / videos

TDP Leader Ashok Gajapathiraju on Paidithalli Festival దైవ కార్యక్రమాలను ఈ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోంది..టీడీపీ నేత అశోక గజపతి రాజు - TDP Leader Ashok Gajapathiraju news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 21, 2023, 5:01 PM IST

TDP Leader Ashok Gajapathiraju on Paidithalli Festival: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్లే దేవుడు నిలబడ్డారనే భ్రమలో నాయకులు ఉన్నారని, రానురాను ఆలయాల్లో జరిగే ఉత్సవాలను చెడగొడుతు‌న్నారని.. తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయన విజయనగరం సిటీ బస్టాండ్ వద్దనున్న వినాయక ఆలయంలో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనవాయితీ ప్రకారం.. పైడితల్లి అమ్మవారి పండగను నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Ashok Gajapathiraju Comments: అశోక్ గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ.. ''ఆలయాల్లో జరిగే ఉత్సవాలను వైసీపీ ప్రభుత్వం చెడగొడుతు‌ంది. గత ఏడాది సింహాచలంలోనూ, పైడితల్లి అమ్మవారి పండగలో చూశాం. ప్రజాప్రతినిధులు గేట్‌కు తాళాలు వేసి, మంత్రులను లోపలికి వెళ్లకుండా చేశారు. ఈసారి ఆ పరిస్థితి లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనవాయితీ ప్రకారం పైడితల్లి అమ్మవారి పండగను నిర్వహించాలి. దేవుడి దగ్గర రాజకీయాలు ఉండకూడదు. పండగలను దుర్వినియోగం చేయకుండా సంప్రదాయ పద్ధతిలో జరిపించాలి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి.'' అని ఆయన విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details