ఆంధ్రప్రదేశ్

andhra pradesh

tdp_leader_achchennaidu_fires_in_ycp_government

ETV Bharat / videos

“లంచం అడగటం నేరం - కానీ ఎమ్మెల్యేలు అడిగితే ధర్మం" ఇదీ వైసీపీ ప్రభుత్వ తీరు - విజయవాడ నగర వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 3, 2023, 9:31 AM IST

TDP Leader Achchennaidu Fires In YCP Government: ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులే రాబందుల్లా వారిని పీక్కుతినడం దారుణమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎమ్మెల్యేలు తమ విధులను మరచి ప్రజల భూములను గద్దల్లా ఎగరేసుకుపోతున్నారని మండిపడ్డారు. “లంచం అడగటం నేరం- కానీ ఎమ్మెల్యేలు అడిగితే ధర్మం” ఇదే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరని అచ్చెన్న ఆరోపించారు. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద జరిగిన ఘటనే దీనికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గోడును సీఎంకు మొరపెట్టుకునేందుకు రాష్ట్ర ప్రజలకు హక్కు లేదా అని ప్రశ్నించారు. 

భూవివాద పరిష్కారానికి నరసరావుపేటకు చెందిన ఓ కుటుంబం స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిని కలస్తే అతను 16 లక్షల రూపాయలు అడగటం దారుణమన్నారు. ఎమ్మెల్యే వేధింపులకు తట్టుకోలేక సీఎంకు చెప్పుకునేందుకు వచ్చిన కుటుంబం తమకు న్యాయం జరగదని ఆందోళన చెంది ఆత్మహత్యకు యత్నించడం తీవ్రంగా కలిచివేసిందని అచ్చెన్న ఆవేదన వ్యక్తం చేశారు. గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్యేగా అనర్హుడని, వెంటనే అతన్ని ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వేధింపుల నుంచి ఆ కుటుంబాన్ని కాపాడాలని అచ్చెన్నాయుడు కోరారు.

ABOUT THE AUTHOR

...view details