ఆంధ్రప్రదేశ్

andhra pradesh

tdp_leader_achanta_sunitha_fires_on_ysrcp_government

ETV Bharat / videos

"వైసీపీ సభలు, సమావేశాలకు ప్రజలను తరలించినప్పుడు నియమాలు గుర్తు రాలేదా జగనన్నా" - TDP Leader Achanta Sunitha

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2023, 7:58 PM IST

TDP Leader Achanta Sunitha Fires on YSRCP Government: ఏం తప్పు చేశారని కుప్పంలోని అంగన్​వాడీలకు ప్రభుత్వం మెమోలు జారీ చేసి జీతాలు నిలిపివేసిందని.. టీడీపీ అంగన్​వాడీ, డ్వాక్రా సాధికార సంఘాల అధ్యక్షురాలు ఆచంట సునీత ప్రశ్నించారు. వారి సమస్యలపై స్థానికి ప్రతిపక్ష నేతలను కలిసినందుకు ప్రభుత్వం వారిపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుందా అని నిలదీశారు. ఇద్దరు అంగన్​వాడీ సిబ్బందిని అన్యాయంగా సస్పెండ్​ చేశారని.. ఇది ఎంత వరకు న్యాయమని అన్నారు. బాబుతో మేము అనే కార్యక్రమంలో పాల్గొన్నారనే నేపంతో వారిని తొలగించడం ఎంతవరకు సమంజసమన్నారు. 

ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలని, వైసీపీ సభలకు ప్రజలను తరలించాలని.. అంగన్​వాడీ సిబ్బందిని ఆదేశించినప్పుడు ప్రభుత్వానికి ఈ నియమాలు గుర్తు రాలేదా అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంపస్​ దాటి ప్రజల్లోకి వచ్చినప్పుడే.. అంగన్​వాడీ కేంద్రాల దుస్థితి, అక్కడి చిన్నారుల ఆకలి కేకలు సీఎంకు కనిపిస్తాయని తెలిపారు. అంగన్​వాడీ సిబ్బంది జీతాల పెంపునకు.. ప్రతిపక్షంలో జగన్​ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చేతులు రావడం లేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్​ కేవలం ఉపన్యాసాలకే పరిమితం అవుతరా అని ప్రశ్నించారు. 

ABOUT THE AUTHOR

...view details