ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP Leadear Bhuma Akhila Priya Hunger Strike : చంద్రబాబు విడుదలయ్యే వరకూ దీక్ష విరమించేది లేదు..: అఖిల ప్రియ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 22, 2023, 12:28 PM IST

tdp_leadear_bhuma_akhila_priya_second_day_hunger_strike_in_nandyala

TDP Leadear Bhuma Akhila Priya Second Day Hunger Strike in Nandyala :మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా నంద్యాలలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, ఆమె సోదరుడు భూమా జగత్ విఖ్యాత రెడ్డి చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరింది. నంద్యాలలో చంద్రబాబు నాయుడు అరెస్టు చేసిన... ఆర్కే ఫంక్షన్ హాలు (Chandrababu Naidu Arrest in RK Function Hall) వద్ద అక్కా తమ్ముడు దీక్షను చేపట్టారు. దీక్ష శిబిరంలో రాత్రి నిద్రపోయారు. వర్షం కారణంగా దీక్ష శిబిరంలోకి వర్షపు నీరు రావడంతో అదే ప్రదేశంలో శిబిరాన్ని వెనుకకు జరిపి దీక్ష కొనసాగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేంత వరకూ దీక్ష విరమించేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి.. వైసీపీ ప్రభుత్వం ఆనంద పడుతోందని ఆమె అన్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై భూమా అఖిల ప్రియ ఆగ్రహం (Bhuma Akhila Priya Fire on YSRCP GovtBehaviour) వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details