TDP Kallu Teripiddam Program: జగనాసురుడికి 'కళ్లు తెరిపిద్దాం'.. మరో వినూత్న నిరసన కార్యక్రమానికి లోకేశ్ పిలుపు - కళ్లు తెరిపిద్దాం పై రోజా కామెంట్స్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 28, 2023, 6:08 PM IST
|Updated : Oct 29, 2023, 6:41 AM IST
TDP Kallu Teripiddam Program: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టుపై టీడీపీ నేతలు, శ్రేణులు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే... మోత మోగిద్దాం, న్యాయానికి సంకెళ్లు, జగనాసుర దహనం కార్యక్రమాలు చేపట్టిన టీడీపీ మరో వినూత్న నిరసనకు పిలుపునిచ్చింది. అరాచక, చీకటి పాలన సాగిస్తున్న జగనాసురుడికి... 'కళ్లు తెరిపిద్దాం' అనే నిరసనకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకూ.. ఆదివారం రాత్రి 7 నుంచి 7.05 గంటల మధ్య... ప్రజలు కళ్లకు గంతలు కట్టుకుని... ఇళ్ల వద్దే బాల్కనీలు, వాకిళ్లు, వీధుల్లోకి వచ్చి నినాదాలు చేయాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు.
చంద్రబాబుకు మద్దతుగా 'నిజం గెలవాలి' అంటూ నినాదాలు చేయాలని సూచించారు. ఈ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంపై టీడీపీ నేతలు స్పందించారు. ప్రభుత్వం కళ్లు తెరిచే వరకూ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. అరెస్ట్ అక్రమం అంటూ నినదించారు. చంద్రబాబు త్వరలో కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.