ఆంధ్రప్రదేశ్

andhra pradesh

jansena_tdp_leaders_fires_on_kodali_nani

ETV Bharat / videos

TDP Jansena Leaders Fires On Kodali Nani గుడివాడలో కొడాలి నాని పనైపోయింది.. టీడీపీ-జనసేన నేతల ఫైర్ - గుడివాడ జనసేన ఇంచార్జ్​ బూరగడ్డ శ్రీకాంత్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 25, 2023, 8:16 PM IST

TDP Jansena Leaders Fires On Kodali Nani: పనికిమాలిన వాగుడు వాగుతున్న మాజీమంత్రి వైసీపీ ఎమ్మెల్యె కొడాలి నాని పనైపోయిందని టీడీపీ నేతలు విమర్శించారు. గుడివాడ టీడీపీ నేతలు, జనసేన నేతలు నానిపై ఫైర్​ అయ్యారు. భర్తకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు ప్రజల్లోకి వెళ్తున్న భువనేశ్వరిపై నిందలు వేస్తున్న కొడాలికి పుట్టగతులు ఉండవని.. టీడీపీ నేత వెనిగండ్ల రాము హెచ్చరించారు. జగన్​ జైలులో ఉన్న సమయంలో విజయమ్మ కూడా ప్రజల్లోకి వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  8వ తరగతి చదివిన నానికి హెరిటేజ్​ లాంటి సంస్థ గురించి ఎలా తెలుస్తుందని అన్నారు. పిచ్చివాగుడు వాగుతున్న కొడాలికి కౌంట్​డౌన్ స్టార్ట్​ అయ్యిందని మండిపడ్డారు. గతంలో రాజకీయ పార్టీల మధ్య కేవలం ఆరోపణలు మాత్రమే ఉండేవని.. ప్రస్తుతం దారుణంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అవినీతిపై ఆరోపణలు మాత్రమే ఉండేవని.. ప్రస్తుతం అరెస్టులు చేస్తున్నారని అన్నారు. ఆ అవినీతిలో అరెస్టైనా వారు నిర్దోషి అని తేల్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింద్నారు.

వంగవీటీ రాధా పెళ్లిలో కొడాలి స్థాయి ఎంటో చూపించారని గుడివాడ జనసేన ఇంచార్జ్​ బూరగడ్డ శ్రీకాంత్​ విమర్శించారు. కొడాలి ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్​ చేశారు.  

ABOUT THE AUTHOR

...view details