తెలుగుదేశం - జనసేన పొత్తులో మరో ముందడుగు! ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు - జనసేన కామెంట్స్ ఆన్ వైసీపీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 11, 2023, 5:01 PM IST
TDP Janasena joint manifesto Committee meeting: తెలుగుదేశం - జనసేన జేఏసీ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేశారు. మొత్తం ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. తెలుగుదేశం పార్టీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, కొమ్మారెడ్డి పట్టాభి, జనసేన పార్టీ నుంచి వర ప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ నియమితులయ్యారు. ఈ నెల 13వ తేదీన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై తెలుగుదేశం - జనసేన జేఏసీ మేనిఫెస్టో కమిటీ భేటీ కానుంది. ఇప్పటికే పలు మార్లు టీడీపీ, జనసేన నేతలు కలిసి ఉమ్మడి సమావేశాలు నిర్వహించాయి.
జనసేన, టీడీపీ సమావేశంలో ఇరుపార్టీలకు చెందిన నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ప్రతి 15 రోజులకోసారి ఇరుపార్టీలు సమావేశం కావలని నిర్ణయించారు. కరువు పరిస్థితులు, రైతుల ఇబ్బందులపై పోరాడాలని నిర్ణయించారు. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలపై జరుగుతున్న దాడులు, నిరుద్యోగ సమస్యలపై చర్చించారు. ఈ మెరకూ... కార్యచరణను సైతం సిద్దం చేస్తున్నట్లు టీడీపీ నేతలు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రయత్నాలు చేపట్టాలని ఇరుపార్టీల నేతలు నిర్ణయించారు.
TAGGED:
Janasena TDP Joint Manifesto