ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP_Janasena_Coordination_Meetings_from_Today

ETV Bharat / videos

TDP Janasena Coordination Meetings from Today: ప్రభుత్వ అరాచకాలపై పోరాటమే లక్ష్యంగా.. నేటి నుంచి టీడీపీ-జనసేన సమన్వయ సమావేశాలు - TDP Janasena news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 29, 2023, 8:13 AM IST

TDP-Janasena Coordination Meetings from Today : తెలుగుదేశం పార్టీ -జనసేన పార్టీల మధ్య సమన్వయానికి నేటి నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి జిల్లా స్థాయిలో సమన్వయ సమావేశాలు జరగనున్నాయి. రాజమండ్రిలో ఈ నెల 23న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో జరిగిన రెండు పార్టీల JAC (Joint Action Committee) సమావేశానికి కొనసాగింపుగా ఈ సదస్సులు జరగనున్నాయి. రెండు పార్టీలు జిల్లాల వారీ సమన్వయకర్తలను నియమించాయి. గ్రామ స్థాయిలోని ప్రజా సమస్యలు, ఉద్యోగ, ఉపాధి కల్పనలో జగన్‌ ప్రభుత్వ వైఫల్యం, కరవు పరిస్థితులు, రైతుల సమస్యలు, ధరలు, పన్నుల బాదుడు, కల్తీ మద్యం విక్రయాలు తదితర అంశాలు, వైఎస్సార్సీపీ ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా భవిష్యత్తు కార్యక్రమాలపై సమావేశాల్లో చర్చించి ఉమ్మడి కార్యాచరణను రూపొందించనున్నారు.

TDP-JSP Three Days District Level Coordination Meetings :ఉమ్మడి జిల్లా స్థాయిలో సమన్వయ సమావేశాలకు.. రెండు పార్టీల నుంచి ప్రతి జిల్లాకు రాష్ట్ర స్థాయి నుంచి ఒక సీనియర్ నేతను రెండు పార్టీలు నియమించాయి. నేడు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం, అనంతపురం జిల్లాల సమన్వయ కమిటీ సమావేశాలకు తెలుగుదేశం నుంచి వంగలపూడి అనిత, బుద్దా వెంకన్న, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎన్‌ఎండీ ఫరూక్‌ లు రాష్ట్ర స్థాయి నేతలుగా హాజరు కానుండగా జనసేన నుంచి బొమ్మిడి నాయకర్‌, కోన తాతారావు, టి.శివశంకర్‌, బోనబోయిన శ్రీనివాసయాదవ్‌, చిల్లపల్లి శ్రీనివాసరావులు పాల్గొంటారు.

రేపు (30వ తేదీ) పశ్చిమగోదావరి జిల్లాలో జరిగే సమన్వయ కమిటీ సమావేశానికి నక్కా ఆనంద్‌బాబు, పాలవలస యశస్వి.. కృష్ణా జిల్లా సమావేశానికి బండారు సత్యనారాయణమూర్తి, చేగొండి సూర్యప్రకాశ్‌లు.. కడప భేటీకి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నయూబ్‌ కమల్​లు, చిత్తూరు జిల్లా సమావేశానికి బీదా రవిచంద్రయాదవ్‌, బొలిశెట్టి సత్యన్నారాయణలు హాజరవుతారు.

ఈ నెల 31న విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, కర్నూలు సమన్వయ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. వీటికి తెలుగుదేశం నుంచి నిమ్మల రామానాయుడు, ఎంఏ షరీప్‌, అమర్‌నాథ్‌రెడ్డి, కాలవ శ్రీనివాసులు హాజరు కానుండగా.. జనసేన నుంచి పడాల అరుణ, ముత్తా శశిధర్‌, పితాని బాలకృష్ణ, పెదపూడి విజయ్‌కుమార్​లు పాల్గొంటారు. 

ABOUT THE AUTHOR

...view details