ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Tdp Innovative Protest అధ్వానంగా రోడ్డు.. వినూత్నంగా టీడీపీ నిరసన - రోడ్డుపై నాట్లు వేసిన టీడీపీ

🎬 Watch Now: Feature Video

Tdp Innovative Protest In Yadamari

By

Published : Jul 28, 2023, 1:04 PM IST

Tdp Innovative Protest In Yadamari: చిత్తూరు-యాదమరి ప్రధాన రహదారిలో ఉన్న గోతుల సమస్యపై టీడీపీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్లపై ఉన్న గుంతల్లో కాడెద్దులతో దుక్కి, దున్ని వరి నాట్లు వేసి ఆ దారి దుస్థితి పై మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని టీడీపీ నేతలు ఆరోపించారు. గుంతలమయమైన ఈ రోడ్డుపై ప్రయాణం సాగించాలంటే జనం భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన పూతలపట్టు టీడీపీ ఇన్​ఛార్జ్​ మురళీమోహన్‌.. గ్రామాల్లోకి వెళ్తే తనను చూసి తలుపులేసుకుంటున్నారని చెప్పే స్థానిక ఎమ్మెల్యే బాబు.. ప్రజల ఇబ్బందులను గురించి పట్టించుకోకపోవడం వల్లే తనకు ఆ పరిస్థితి వచ్చిందని ఆయన గుర్తించాలి అని అన్నారు. రోడ్లు ఇంత అధ్వానంగా ఉంటే అధికార పార్టీ నాయకులు, సంబంధిత శాఖాధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇది ఆరంభం మాత్రమేనని, రహదారిని వెంటనే  బాగుచేయకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details