ఆంధ్రప్రదేశ్

andhra pradesh

dfgnf

ETV Bharat / videos

MM Kondaiah fire on CM Jagan: జగన్ పాలనలో అన్ని వర్గాలకు తీవ్ర ఇబ్బందులు: కొండయ్య - TDP incharge of Cheerala constituency

By

Published : Jun 9, 2023, 1:29 PM IST

Cheerala TDP incharge Kondaiah frie on Jagan: టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ  టీడీపీ ఇంచార్జ్ ఎం.ఎం. కొండయ్య అన్నారు. ముందుగా ఆయన పార్టీ  కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కొండయ్య మాట్లాడుతూ.. మహానాడులో 'భవిష్యత్తుకు గ్యారెంటీ' అనే కార్యక్రమాన్ని పార్టీ ప్రకటించిందని తెలిపారు. దీనిలో భాగంగా మహిళల స్వయం సాధికారతకు పెద్దపీట వేసిందన్నారు. రాష్ట్రంలో మెుదటిసారిగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మహా నాయకుడు ఎన్టీఆర్​దే అని ఆయన కొనియాడారు. ప్రస్తుతం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిపైనే దాడులు చేయటం దారుణమన్నారు. వైసీపీ నాయకులు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారో వాటి అన్నింటికి సమాధానం చెప్పడానికే  పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని వివరించారు. వైసీపీ కంటే సమర్ధవంతమైన పాలన అందిస్తామని అన్నారు. అసలు సంక్షేమ పథకాలు ప్రజలకు పరిచయం చేసిందే తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. లోకేశ్ చేపట్టిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కొండయ్య పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details