ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP Flexies in YCP Program

ETV Bharat / videos

TDP Flexies in YCP Program: కుప్పంలో వైసీపీ నేతల ర్యాలీ.. దిమ్మతిరిగేలా టీడీపీ ఫ్లెక్సీలు - ycp leaders cars rally in kuppam

By

Published : Jul 8, 2023, 4:21 PM IST

TDP Flexies in YCP Program: చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లు చర్చనీయాంశమైయ్యాయి. వైసీపీ ఐటీ వింగ్ సోషల్ మీడియా ఆధ్వర్యంలో బెంగుళూరుకు చెందిన కొందరు వైసీపీ నేతలు నేడు బెంగుళూరు నుంచి కుప్పం వరకు వైసీపీ నాయకులు 175 కార్లతో ర్యాలీ చేపట్టారు. వారికి స్వాగతం పలుకుతూ టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఏర్పాటైన ఫ్లెక్సీలు స్థానికంగా కలకలం రేపాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో  కుప్పం నియోజకవర్గంలో జరిగిన అభివృధ్ధి నిర్మాణాల ఫొటోలతో కూడిన స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. 'టీడీపీ పాలనలో జరిగిన కుప్పం ప్రగతిని వీక్షించి క్షేమంగా వెళ్లాలి అని కోరుతూ' అంటూ బ్యానర్లలో ముద్రించారు. నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారి ఇరువైపులా తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ బ్యానర్లు వెలిశాయి. 

ఫ్లెక్సీలు చించివేసిన గుర్తుతెలియని వ్యక్తులు: టీడీపీ అభివృద్ధిపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు. వైసీపీ చేసిన అభివృద్ధి ఏమి లేకనే.. టీడీపీ ఏర్పాటు చేసిన బ్యానర్లు తొలగించారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details