Selfie Video Viral: టీడీపీ అభిమాని ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియో వైరల్ - ap varthalu
TDP Fan Suicide Attempt: వైసీపీ నాయకుల వేధింపులు తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ అభిమాని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది. నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం కాండ్రపాడు గ్రామానికి చెందిన దండ అవినాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. చురుగ్గా ఉండటం వల్ల వైసీపీ నాయకులు వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఇటీవల టీడీపీ జెండా కడితే వైసీపీ నాయకులు బెదిరించి తీసేయించారన్నారు. దీనిపై చందర్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎస్సై తిరిగి తనపైనే కేసు నమోదు చేస్తానని, రౌడీషీట్ ఓపెన్ చేస్తానని బెదిరించాడన్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ముకుందా రెడ్డి, కృష్ణారెడ్డి మరోసారి బెదిరించడంతో పాటు చంపుతానని హెచ్చరించడంతో మనస్తాపంతో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో వెల్లడించారు. విషయం తెలుసుకున్న బంధువులు నందిగామ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. సెల్ఫీ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్గా మారింది. వైసీపీ నాయకుల వేధింపులు వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అందులో వెల్లడించాడు.