ఆంధ్రప్రదేశ్

andhra pradesh

protests_across_the_state

ETV Bharat / videos

TDP Fan Climbed Temple Steps on knees చంద్రబాబు విడుదల కావాలంటూ.. 350 గుడి మెట్లను మోకాళ్లతో ఎక్కిన టీడీపీ అభిమాని - skill development case

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 23, 2023, 8:16 PM IST

TDP Leader Climbed Temple Steps on knees:అక్రమ కేసుల నుంచి చంద్రబాబు వెంటనే విడుదల కావాలని  ఓ టీడీపీ అభిమాని.. 350 గుడిమెట్లను మోకాళ్లతో ఎక్కారు.  తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామంలో టీడీపీకి కీలక నేతగా ఉన్న నాగం వెంకటపతి.. గ్రామ సమీపంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం మెట్లను మోకాళ్లపై ఎక్కాడు. పార్టీ జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట నడిచారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ స్వామివారి కొండపైకి ఎక్కేందుకు ఉన్న 350 మెట్లును మోకాళ్లతో ఎక్కడం అంటే సాహసోపేత అభిమానమని అన్నారు. చంద్రబాబు ఈ అక్రమ కేసుల నుంచి బయట పడాలని మొక్కుకుని  నాగం వెంకటపతి ఈ మెట్లను మోకాళ్లపై ఎక్కాడన్నారు. అక్రమాలు చేసిన వారు స్వేచ్ఛగా బయట తిరుగుతుంటే అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా బ్రతికిన చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు గురిచేయడం అన్యాయమన్నారు. అతి త్వరలోనే ఈ అక్రమ కేసుల నుంచి ఆయన బయటపడి కడిగిన ముత్యంల మన ముందుకు వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details