TDP Leader Tangirala Sowmya Fires On YCP ఈ ప్రభుత్వానికి టాయిలెట్స్ నిర్మించడం కూడా రాదు.. : టీడీపీ నేత తంగిరాల సౌమ్య - నందిగామలో టాయిలెట్ల సమస్య
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 16, 2023, 5:22 PM IST
TDP Ex MLA Tangirala Sowmya Fires On YCP: వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి టాయిలెట్స్ నిర్మించడం కూడా తెలియదని మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ఎద్దేవా చేశారు. అధికార పార్టీ నేతల అనాలోచిత నిర్ణయాలతో నందిగామకు గ్రహణం పట్టిందని ఆమె అన్నారు. వైసీపీ ఏ పని చేపట్టినా.. అది వివాదాస్పదమై అని ఆమె ఆరోపించారు. నేడు నందిగామలో పర్యటించిన తంగిరాల సౌమ్య.. టీడీపీ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం, రామన్నపేట బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన టాయిలెట్స్‌ను పరిశీలించారు. కళ్యాణ మండపం గేట్ ఎదురుగా టాయిలెట్స్ నిర్మించడం అంటే ప్రజల నమ్మకాలను ఆ గౌరవ పరచడమే అని ఆమె అన్నారు. ఈ నిర్మాణానికి ఎవరు అనుమతులు ఇచ్చారని సౌమ్య ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ టీడీపీపై నిందలు వేసే చౌకబారు ఎత్తుగడలు మాని.. తక్షణమే ఈ టాయిలెట్స్ ఎక్కడ ఉంచితే ప్రయోజనం కలుగుతుందో ప్రజాభిప్రాయం తీసుకొని, సక్రమమైన డ్రైనేజీ ఉన్నచోట నిర్మించవలసిందిగా అధికారులను ఆమె డిమాండ్ చేశారు. అనంతరం రామన్నపేట రోడ్డులో గల జిల్లా కోర్టు వద్ద నిర్మిస్తున్న కల్వర్టును పరిశీలించిన సౌమ్య.. ఆ రహదారిలో వెళ్లే వాహనదారులు పడుతున్న అవస్థలను.. అడిగి తెలుసుకున్నారు.