ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP_Devineni_Uma_on_Votes_Deletion_in_AP

ETV Bharat / videos

పింగళి వెంకయ్య కుటుంబ సభ్యుల ఓట్ల తొలగింపు వైసీపీ అరాచకానికి ప్రత్యక్ష ఉదాహరణ : దేవినేని - టీడీపీ నేత దేవినేని ఉమా లేటెస్ట్ న్యూస్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 5:01 PM IST

Updated : Nov 22, 2023, 5:24 PM IST

TDP Devineni Uma on Votes Deletion in AP: దేశానికి జాతీయ జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య కుటుంబ సభ్యుల ఓట్లను జగన్ రెడ్డి తొలగించారని మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే ఓటర్ల లిస్టులో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఓట్ల అవకతవకలపై టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో ఉమా పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ప్రజాప్రతినిధుల ఓట్లనే తొలగిస్తే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటో.. రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో ఈ ఘటన తెలియజేస్తుందన్నారు. 

గొల్లపూడిలో పింగళి వెంకయ్య మనమరాలు ఛాయాదేవి, వారి కుమారుడు సత్యనారాయణమూర్తి ఓట్లను తీసేశారని ఉమ మండిపడ్డారు. రాష్ట్రంలో ఓటర్ల లిస్టులో జరుగుతున్న అరాచకానికి ఇవి ప్రత్యక్ష ఉదాహరణలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అవకతవకలపై అధికారులకు అనేక ఫిర్యాదులు చేసినా ఏమాత్రం చర్యలు తీసుకోకుండా వాటిని రిపీట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు శ్రేయోభిలాషుల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. 175 కు 175 గెలవాలని దుర్మార్గపు ఆలోచనతో ఈ దుర్మార్గులంతా కలిసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ తప్పుడు పనులు చేస్తున్నారని విమర్శించారు. ప్రతి పౌరుడికి ఓటు హక్కు అనేది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కల్పించిన హక్కు ఆ ఓటు హక్కును తీసివేస్తున్నారని ఎద్దేవా చేశారు. తక్షణమే తొలగించిన ఓట్లను పునరుద్ధరించి, దొంగ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేశారు.

Last Updated : Nov 22, 2023, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details