ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP_Demands_Justice_for_Dalit_Young_Man

ETV Bharat / videos

దళిత యువకుడు శ్యాంకుమార్‌పై దాడికి నిరసనగా టీడీపీ నేతల ఆందోళన - పరిస్థితి ఉద్రిక్తం - AP News

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 4, 2023, 9:16 PM IST

TDP Demands Justice for Dalit Young Man : దళిత యువకుడు శ్యాంకుమార్‌పై జరిగిన దాడికి నిరసనగా.. టీడీపీ నేతలు నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితిసింది. దళిత యువకుడుపై మూత్రం పోసి దాడికి పాల్పడిన నిందితులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎన్​టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం బీరకలపాడు క్రాస్‌రోడ్డుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు బైఠాయించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది.

 ఈ నేపథ్యంలో నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు రాజును పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి..  వేర్వేరు పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై భారీ జనం గుమిగూడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దళితుడికి న్యాయం చేయమని అడిగితే పోలీసులు నిర్భందించటం చాలా విడ్డూరంగా ఉందన్నారు. పోలీసులు తీరుపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details