TDP Cycle Yatra on Chandrababu Arrest: చంద్రబాబుకు మద్దతుగా సైకిల్ యాత్ర.. కుప్పంలో ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు - చిత్తూరు జిల్లా లేటెస్ట్ న్యూస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 22, 2023, 11:12 AM IST
TDP Cycle Yatra on Chandrababu Arrest: శ్రీకాకుళం నుంచి కుప్పం చేరుకున్న టీడీపీ సైకిల్ యాత్రకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ కేసుల నుంచి క్షేమంగా బయట పడాలి అని దైవాన్ని కోరుతూ శ్రీకాకుళం జిల్లా నుంచి టీడీపీ కార్యకర్తలు చేపట్టిన సైకిల్ యాత్ర ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పం చేరుకుంది. శ్రీకాకుళం జిల్లా రణ స్థలం నుంచి టీడీపీ కార్యకర్తలు.. రామక్రిష్ణ, రామసూరి, ఆదినారాయణ, సుందర్రావు, రమేష్ అక్టోబర్ 2న సైకిల్ యాత్రను ప్రారంభించారు. దాదాపు 90 నియోజకవర్గాల్లో పర్యటించిన వీరు కుప్పం చేరుకున్నారు. ఈ రోజు కుప్పం నియోజకవర్గానికి చెరుకున్న వారికి శాంతిపురం, కుప్పం మండలాల్లో నాయకులు స్వాగతం పలికి.. ఘనంగా సత్కరించారు.
"ఏపీలో వైసీపీ కక్ష పూరిత రాజకీయాలు చేస్తోంది. రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగితే.. ప్రతిపక్షాలు పక్కరాష్ట్రాలకు పోవాల్సిందే. ఏపీలో సీఎం జగన్ పోవాలి.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను." - రామకృష్ణ, శ్రీకాకుళం