ఆంధ్రప్రదేశ్

andhra pradesh

డూండీ రాకేశ్

ETV Bharat / videos

Dundi Rakesh: "జగన్​ ప్రభుత్వం.. వ్యాపారుల నుంచి కోట్ల రూపాయలు దండుకుంది": డూండీ రాకేశ్ - Jay Tax

By

Published : Jun 17, 2023, 9:41 PM IST

Dundi Rakesh Fires on CM Jagan: ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి ప్రభుత్వం వ్యాపారుల నుంచి లక్షల కోట్ల రూపాయలు దోచుకుందని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండీ రాకేశ్​ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. జే టాక్స్​ల పేరుతో 32 వేల కోట్ల రూపాయలు వ్యాపారుల నుంచి దండుకుందన్నారు. జగన్​ దోపిడిని, అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు.. ‘వ్యాపారుల నుంచి కొట్టేసిన కమీషన్లతో తాడేపల్లి ప్యాలెస్ ఫుల్ – వ్యాపారుల జేబులకు చిల్లు’ పేరుతో కరపత్రాలు ముద్రించినట్లు వివరించారు. ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డిని శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్​కు పరిమితం చేయటమే.. వ్యాపార వర్గాల ధ్యేయమన్నారు. జగన్​ నాలుగేళ్ల పాలన.. వ్యాపార, వాణిజ్యవర్గాలకు చీకటి పాలనగా ఉందని అభివర్ణించారు. కరోనా లాంటి భయంకర పరిస్థితుల్లో కూడా వ్యాపారులను వదలకుండా పీక్కుతిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వాళ్ల వ్యాపారులు 45వేల కోట్ల రూపాయల వరకు నష్టపోయారని ఆరోపించారు. జగన్​ దోపిడి తట్టుకోలేక నాలుగు సంవత్సరాలలో 400మంది వ్యాపారులు బలవన్మరణాలకు పాల్పడ్డారని డూండీ రాకేశ్​ మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details