ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మార్కాపురంలో చంద్రబాబు రోడ్ షో

ETV Bharat / videos

CBN ROAD SHOW: మార్కాపురంలో చంద్రబాబు రోడ్ షో.. పెద్ద ఎత్తున హాజరైన టీడీపీ శ్రేణులు - పసుపుమయమైన మార్కాపురం

By

Published : Apr 20, 2023, 10:40 PM IST

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. ఈరోజు చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు మార్కాపురంలో పార్టీ శ్రేణులు మధ్య జరుపుకున్నారు.  జిల్లాలో పండగ వాతావరణం నెలకొంది. మార్కాపురంలో చేపట్టిన చంద్రబాబు రోడ్‌ షోకు..పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. కార్యకర్తలతో మార్కాపురం పసుపుమయంగా మారింది. 

రాష్ట్ర ప్రజల్ని ఉద్ధేశించి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే తపన ప్రజల్లో ఉందని చంద్రబాబు అన్నారు.  రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులు పడకేశాయని, గిట్టుబాటు ధరలు లేక రైతులు అప్పులపాలయ్యే పరిస్థితి ఏర్పడిందని, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లిచ్చి సాగునీటి సమస్య పరిష్కరిస్తానని, వెలుగొండ ప్రాజెక్టు తనే పూర్తి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పోలవరం పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని సంకల్పించామని చంద్రబాబు అన్నారు. మార్కాపురం ప్రజానికం సంతోషం వ్యక్తం చేశారు. 

సమైక్యాంధ్రప్రదేశ్‌ విజన్‌ రూపొందిస్తే ఎగతాళి చేశారని చంద్రబాబు అన్నారు. టీడీపీ హయాంలోనే ఆడబిడ్డలకు రిజర్వేషన్లు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. నిరుపేదలకు టీడీపీ జెండా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పని అయిపోయిందని, వైఎస్సార్సీపీని చిత్తుచిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలని చంద్రబాబు పిలుపును ఇచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details