ఆంధ్రప్రదేశ్

andhra pradesh

cbn_on_yanadus

ETV Bharat / videos

యానాదుల్ని, వారి పిల్లల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాదే: చంద్రబాబు నాయుడు - Tdp Chief Chandrababu visit news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2023, 3:58 PM IST

TDP Chief Chandrababu on Yanadus:యానాదులకు, వారి పిల్లలకు తెలుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భరోసానిచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే యానాదుల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తనదేనని అన్నారు. కాలనీ పిల్లలను చదివించి, వారిని ప్రయోజకులను చేసే బాధ్యత కూడా తనదేనని పేర్కొన్నారు. టీడీపీ తరఫున ఒక్కో ఇంటికి రూ.5 వేల సాయం అందిస్తున్నామన్న చంద్రబాబు ప్రభుత్వం రూ.25 వేల ఆర్థిక సాయాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

Chandrababu Naidu Comments: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన బాపట్ల జిల్లా జమ్ములపాలెంలోని ఎస్టీ కాలనీలను సందర్శించారు. తుపాను వల్ల సర్వం కోల్పోయామని, విద్యుత్ సరఫరా లేక 4 రోజులు చీకట్లోనే గడిపామని కాలనీ వాసులు చంద్రబాబు ముందు కన్నీరుమున్నీరయ్యారు. ఆ సమయంలో ఆదుకునేందుకు ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదని కాలనీ వాసులు ఆయనకు వివరించారు. ''యానాదుల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. టీడీపీ తరఫున ఒక్కో ఇంటికి రూ.5 వేలు సాయం అందిస్తున్నాం. ప్రభుత్వం రూ.25 వేల ఆర్థిక సాయం అందించాలి. జిల్లా కేంద్రంలోనే ఇంత దారుణ పరిస్థితులు ఉండటం దుర్మార్గం. గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారనే ఎస్టీ కాలనీపై కక్షకట్టారు. కాలనీ పిల్లలను చదివించి, వారిని ప్రయోజకులను చేసే బాధ్యత కూడా నాదే.'' అని చంద్రబాబు నాయుడు గిరిజనులకు భరోసానిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details